మార్కెట్లకు మూడో రోజూ నష్టాలు

Apr 16,2024 21:25 #Business, #Stock Markets

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలు చవి చూశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ 73వేల దిగువకు పడిపోయింది. గతవారం రికార్డు స్థాయిలో 75వేల మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఆందోళనలు.. ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 456 పాయింట్ల నష్టంతో 72,944కు పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 125 పాయింట్లు పతనమె 22,148 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టైటాన్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, మారుతీ సుజుకీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ లాభపడ్డాయి.

➡️