సెనేట్‌ విచారణలో క్షమాపణలు చెప్పిన మార్క్‌ జుకర్‌బర్గ్‌

Feb 1,2024 11:50 #Mark Zuckerberg
  • ‘మీరు అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదు’ అంటూ క్షమాపణ

వాషింగ్టన్‌: సోషల్‌ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రతపై యూఎస్‌ సెనెట్‌ విచారిస్తున్న సమయంలో మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు తెలియజేశారు. విచారణ సమయంలో మధ్యలో లేచి మన్నించాలని బాధిత కుటుంబాలను కోరారు. ‘మీ చేతులకు రక్తం అంటుకొని ఉంది’ అంటూ ఆ సంస్థలపై సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో మెటా సీఈఓ తన సీటు నుంచి లేచి బాధిత చిన్నారుల తల్లిదండ్రుల వైపు చూస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘మీరు అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదు’ అంటూ సారీ చెప్పారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థలు మెటాకు చెందినవి. వాటిద్వారా టీనేజర్స్‌కు అపరిచితులు పంపే సందేశాలను బ్లాక్‌ చేస్తామని మెటా వెల్లడించింది. మెటాతో పాటు టిక్‌టాక్‌, ఎక్స్‌ (ట్విటర్‌), డిస్కార్డ్‌, స్నాప్‌చాట్‌ ప్రతినిధులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు.

➡️