తేనెమంచు, పక్షికన్ను తెగులుపై అప్రమత్తంగా ఉండాలి

Dec 4,2023 16:57 #Krishna district
mango crop problems

నూజివీడు మండల ఉధ్యానవన శాఖాధికారణి ఆర్‌.హేమ

నూజివీడు : ప్రస్తుతం మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయనీ, వర్షాలు పడుతుండటం ఆగగానే మామిడికి తేనేమంచు, తామర పురుగులు, పక్షికన్ను తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని నూజివీడు మండల ఉధ్యానవన శాఖాధికారణి ఆర్‌.హేమ హెచ్చరించారు. ఆమె ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తేనేమంచు, పక్షికన్ను తెగుళ్లు నివారణకు తక్షణమే ఇమిడిక్లోరిట్‌ 0.3 మి.లీ.గ్రాములుతోపాటుగా సిలింధ్రనాశికలైన కార్బన్‌డిజమ్‌ 1 గ్రాము లేదా క్లోరోలోఁ 2 గ్రాములు లీటరు లీటిలో కలిపి పిచికారీ చేయాలఁ సూచించారు. లేదా మానంకోజబ్‌ రెండుగ్రాములు, జిగురు 0.5 మిల్లీ గ్రాములు కలిపి పిచికారీ చేయించాలన్నారు. నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, విభాగాధిపతి డాక్టర్‌ బి.కనకమహాలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ కె.రాధారాణి, ఏలూరు జిల్లా ఉధ్యానవనశాఖాధికారి ఎస్‌.రామ్మోహన్‌, ఉధ్యానవన సంచాలకనిలు జె.శాంతి తదితరుల సహాయంతో మామిడి సాగుచేసే రైతులకఁ అవసరమైన సలహాలు సూచనలను అందజేస్తున్నామని వివరించారు.

పూత,పిందె సమయంలో సస్యరక్షణ చర్యలు
– పూత బాగా రావాలంటే 2 నుంచి 3నెలల బెట్ట అవసరం (అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌)-డిసెంబర్‌ నెలలో పూమొగ్గ దశలో తేలికపాటి నీటితడులు తప్సనిరిగా ఇవ్వాలి
– పిందె ఏర్పడిన తరువాత 20 నుంచి 25 రోజులకఁ ఓసారి నీటి తడులు ఇవ్వాలి-పూత రాలటం సహజం, మొగ్గ పుష్పాలు, ఫలదీకరణ చెందని పుష్పాలు రాలిపోతాయిపూత అధికంగా రాలుతుంటే ఒక మి.లీ నాఫ్తలిన్‌ ఎసిటిక్‌ ఆమ్లం 20 పిపిఎం లేదా ప్లానోఫిక్స్‌ 1.మిలీ.మ 4

-5 లీటర్ల నీటిలో కలిపి బఠాణి సైజు, నిమ్మకాయ సైజులో ఉన్న పిందెలపై పిచికారీ ఏయాలి-తేనేమంచు పురుగునివారణకు వేపనూనె 1500 పిపిఎం, 3.మి.లీ లేదా ఇమిడాక్ల్రోప్రిడ్‌ 0.3 మి.లీ.లేదా ధైయోమిధాక్యామ్‌ 0.5 గ్రాము లేదా క్లోరిపైరిపాస్‌ 20 ఇసి, 2.5 మి.లీ., లీటరు నీటిఁ కలిపి పిచికారీ చేసుకోవాలి.

-తామర పురుగు ఉధృతి తెలుసుకోవటానికి తోటల్లో జిగురు అట్టలను (పసుపు, నీలం రంగు అట్టలను) ఏర్పాటు చేసుకోవాలి.

-తామర పురుగు మొదటి దశలో 1500 పిపిఎం 3 మి.లీ.చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉధృతి అధికంగా ఉంటే స్పైనోసాడ్‌ 0.25 మిలీ థయోమికాధాక్యామ్‌ 0.05 గ్రా లేదా ఫిప్రోఁల్‌ గోల్డ్‌ 2.0 మి.లీ.ను ఇమిడిక్లోప్రిడ్‌ 0.3 మి.లీ./లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి

-పొంగామియా సోప్‌ 7.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బంగినపల్లి కాయలను ఆశించే నల్లమచ్చ తెగులు నివారణకు కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3జి లిట్‌ఫ్లస్‌ స్ట్రప్టోసైక్లిన్‌ లేదా ఆగ్రోమైసిన్‌ 2 గ్రా.10 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మామిడిలో పూతను తినే గొంగళి పురుగులు, కాయతొలుచు పురుగు, కొక్కం పురుగులు, ఆకనిగూడు పురుగు ఉధృతి ఉంటే ఎమామెక్టిన్‌ బెంజోయెట్‌ 0.4 గ్రాములు లేదా ఇమిడా కోఎ్లప్రిడ్‌ ఫ్లస్‌ బిటా సైఫ్‌లోధ్రిన్‌ లేక లెమడాసెఫ్‌లోత్రిన్‌ 5 శాతం ఇసి 0.5 మిలీ లేదా థయామిధాక్యామ్‌ ఫ్లస్‌ లెమడాసెఫ్‌లోత్రిన్‌ ఒక మి.లీ లీటరు కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెలుగు : వాతావరణంలో రాత్రి చలి అధికంగానూ, పగలు వేడి వాతావరణంలో ఉన్నప్పుడు బూడిద తెగులు ఆశిస్తుంది.

➡️