గోకవరంలో మండల సర్వసభ్య సమావేశం

Apr 10,2024 15:51 #East Godavari

ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం ఎంపీపీ కార్యక్రమంలో మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీడీఓ గోవింద్ ఆధ్వర్యంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి అధ్యక్షత నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి దాసరి శ్రీరంగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను అధికారులను గ్రామాల్లో తాగునీరు, పశువులకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులకు కూడా ప్రతి గ్రామంలో లైన్మెన్ అందుబాటులో ఉండాలని దానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైస్ ఎంపీపీ మడికి మైనర్ బాబు తంటికొండ గ్రామంలో ఉన్న నీటి సమస్య, విద్యుత్ సమస్య ప్రత్యేకతను పూర్తి చేయలని అధికారులను కోరగా తగు చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు. ఎంపీడీవో గోవిందు మాట్లాడుతూ రానున్న రోజులు జరగనున్న సర్వసభ్య సమావేశానికి ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కావలసిన మౌలిక సదుపాయాలు మూడు రోజులు ముందుగా నివేదికను మండల పరిషత్ కార్యాలయానికి అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశార. మనుషులు ప్రతిసమస్య అడగ గలరు కానీ పశువుల నోరులేని జీవులు అడుగలేవని కాబట్టి వాటికి ఆయా గ్రామాలలో నీటి తొట్లు నిర్మించిన వాటిని పరిశుభ్రంగా ఉంచి లీకులు ఏమైనా ఉంటే రిపేర్ చేసి పశువులకు అందుబాటులో తొట్టెలులో నీరు ఉండేటట్లు చర్యలు తీసుకురావాలని కోరారు. ఆయా గ్రామాల సర్పంచులు నిధులు కొరకు కోరగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నది కనుక నిధులు మంజూరు చేయుటకు అధికారాలు లేవని ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుంకర వీరబాబు, దాసరి రమేష్, వైస్ ఎంపీపీ మడికి మైనర్ బాబు, కో ఆప్షన్ నెంబర్,తోలేటి రాంప్రసాద్, ఆయా ఎంపిటిసిలు, గ్రామ సర్పంచులు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️