ప్రముఖ మలయాళ నటి లక్ష్మీకా కన్నుమూత

Dec 8,2023 16:49 #Actress, #passed away
malayalam actress sajeevan passed away

ప్రముఖ మలయాళ నటి లక్ష్మీకా సజీవన్(24) కన్నుమూశారు. ఆమె గుండెపోటుతో యుఎఈలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం మిగిల్చింది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే నటిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీకా మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అజు అజీష్ దర్శకత్వం వహించిన ‘కాక్క’ షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష‍్మిక ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. దుల్కర్ సల్మాన్ తో ఒరు యమందన్ ప్రేమకథా చిత్రంలో నటించిన లక్ష్మిక సజీవన్ తన కెరీర్‌లో పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్ చిత్రాల్లో మెప్పించారు.

➡️