ఏఐకేఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయండి : సిఐటియు

Dec 14,2023 16:27 #CITU, #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు కర్నూలు పాత బస్టాండులో 15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఓల్డ్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో జమ్మి చెట్టు నుండి కిడ్స్‌ వరల్డ్‌ పార్క్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిఐటియు ఓల్డ్‌ సిటీ కమిటీ అధ్యక్షులు అబ్దుల్‌ దేశారు, సిఐటియు ఓల్డ్‌ సిటీ కమిటీ ప్రధాన కార్యదర్శి మారేళ్ళ విజయ రామాంజనేయులు, సిఐటియు నగర ఉపాధ్యక్షులు కే.రామకృష్ణ,ఆటో యూనియన్‌ నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి రవి కుమార్‌, మైముద్‌,నగర ఉపాధ్యక్షులు కుమార్‌, సిఐటియు నగర నాయకులు రాంబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి మారేళ్ళ విజయ రామాంజనేయులు మాట్లాడుతూ.. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి.. అన్నం పెట్టే రైతన్నలకు అధిక వడ్డీతో డబ్బులు వసూలు చేస్తున్నారని నష్టాలలో ఉండి అప్పు కట్టలేని రైతు ఆత్మహత్య చేసుకునే విధంగా అవమాన పరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్‌ అని ప్రచారం చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్ర బిజెపి ప్రభుత్వానికి లొంగిపోయి 2020 లో విద్యుత్‌ సంస్కరణల పేరుతో బిల్లు తెస్తే వాటిని అమలు చేస్తున్న దేశంలో మొట్టమొదటి రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వారికి రైతులకు నష్టం చేస్తున్నాడని గుర్తు చేశారు, సిఐటియు కార్మిక సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తూనే కార్మిక కర్షక మైత్రిని కొనసాగింపులో భాగంగానే వారి పోరాటంలో భాగస్వామ్యమై ముందుకెళ్తామని వారన్నారు, ఈనెల 15వ తారీకున కొత్త బస్టాండ్‌ నుండి మూడు గంటలకు ర్యాలీ సాయంత్రం నాలుగు గంటలకు కర్నూలు పాత బస్టాండ్‌ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్మికులను,ఉద్యోగ కార్మికులను,చిన్న వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను, పేద మధ్యతరగతి ప్రజలను కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సిఐటియు హమాలి కార్మిక నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

➡️