నీళ్లతో ప్రధాన కాల్వ కళకళ..

Apr 12,2024 23:58

ఈపూరు మండలం ఊడిజర్ల సమీపంలో కుడి ప్రధాన కాల్వలో సాగర్‌ జలాలు
ప్రజాశక్తి-ఈపూరు : నీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు చాలా రోజులు తర్వాత సాగర్‌ కుడి ప్రధాన కాల్వలో సాగర్‌ జలాలు నిండుకుండలా ప్రవహిస్తూ దర్శనమిచ్చాయి. బొమ్మరాజు పల్లి, ఈపూరు, ఊడిజర్ల, అగ్నిగుండాల, బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామాల మీదుగా సాగర్‌ జలాలు శుక్రవారం ప్రకాశం జిల్లాలోకి చేరాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కాల్వలకు నీటి విడుదల లేకపో వడంతో కొద్ది నెలలుగా భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు మొండికేశాయి. గృహ అవసరాలకు వినియోగించే బోర్లు సైతం నీటిని సరిపడా నీరివ్వడం లేదు. రక్షితనీటి పథకాల ద్వారా గ్రామాలకు నిరందించే చెరువులు సైతం నిండుకోవ డంతో గ్రామాలను నీటి కష్టాలు చుట్టుము ట్టాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం రోజుకు 5500 క్యూసె క్కుల చొప్పున మొత్తంగా ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయడంతో 10 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుంది. పంచా యతీలు, మున్సిపాల్టీల పరిధిలోని చెరువు లను, నీటి కుంటలను నింపే పనిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు నిమగమయ్యారు.

➡️