నమ్రతకు మహేశ్‌బాబు స్పెషల్‌ విషెస్‌..!

Jan 22,2024 12:36 #mahesh babu, #Namrata, #special wishes

హైదరాబాద్‌ : టాలీవుడ్‌లోని అందమైన జంటల్లో ప్రిన్స్‌ మహేశ్‌ బాబు- నమ్రత శిరోద్కర్‌ ఒకరు. నేడు నమ్రత శిరోద్కర్‌ 53వ పుట్టిన రోజు సందర్భంగా … మహేశ్‌ బాబు తన భార్యకు ఎక్స్‌ వేదికగా స్పెషల్‌ విషెస్‌ తెలిపారు. హ్యాపీ బర్త్‌ డే ఎన్‌ఎస్‌జీ అంటూ.. లవ్‌ సింబల్‌ జత చేస్తూ ట్వీట్‌ చేశారు. ” నా జీవితంలో ప్రతి రోజును అద్భుతంగా తీర్చిదిద్దుతున్న నువ్వు ఈ ఏడాదిలో మరింత ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా ” అని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు కూడా నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

➡️