కొనసాగుతోన్న మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Mar 28,2024 11:36 #2024 elections, #MLC, #Telangana

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. దీని కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎక్స్‌అఫీషియో సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

➡️