ఎసెక్విబో వెనిజులా హక్కు : మదురో

Dec 7,2023 10:06 #Nicolas Maduro, #Venezuela
maduro venezuela comments on Guayana Esequiba

కారకస్‌ : వెనిజులాకు సహజసిద్ధ సరిహద్దుగా ఉన్న ఎసెక్విబా ప్రాంతం తమ హక్కు అని వెనిజులా అధ్యక్షులు నికొలస్‌ మదురో అన్నారు. గుయానా ఆక్రమించిన ఈ ప్రాంతం తమదేనని చెబుతూ బిల్లును రూపొందించినున్నట్లు ఆయన తెలిపారు. ‘గుయానా ఎసెక్విబా’ ప్రావిన్స్‌ను ఏర్పాటు చేసేందుకు బిల్లును రూపొందించాలంటూ అధికారులకు ఆయన ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఆ ప్రాంతంలోకి ప్రవేశించి శిలాజ ఇంధనాలను, ఖనిజాలను అన్వేషించడానికి సిద్ధపడాల్సిందిగా వెనిజులా మైనింగ్‌ సంస్థలకు సూచించారు. ఎసెక్విబో ప్రాంతంలో చమురు, గ్యాస్‌, ఖనిజాలు అన్వేషించేందుకు లైసెన్సులు మంజూరు చేస్తానని మదురో చెప్పారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న గుయానా కంపెనీలు మూడు నెలల్లోగా అక్కడ నుండి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. శిలాజ ఇంధనాలు, ఖనిజ నిక్షేపాలు కలిగియున్న ఎసెక్విబో ప్రాంతం తమదేనంటూ దశాబ్దాల తరబడి వెనిజులా చెబుతూ వస్తోంది. ఆ ప్రాంతంలో తూర్పున గల ఎస్‌క్విబో నది తమకు సహజసిద్ధమైన సరిహద్దుగా వుందని, అందువల్ల దీన్ని చారిత్రకంగా తమ ప్రాంతంగా గుర్తించినట్లు వెనిజులా చెబుతోంది. ఎసెక్విబో ప్రాంతంలో 8 లక్షల మంది జనాభా ఉండగా..మూడింట రెండింతలు 1.25 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాన్ని గుయానా ఆక్రమణలో ఉంది. అయితే వెనిజులా వాదనను గుయానా అధ్యక్షులు ఇర్ఫాన్‌ అలీ ఖండించారు. ఈ కేసును ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తీసుకెళతానని హెచ్చరించారు.

➡️