”మధురము కదా” లిరికల్‌ సాంగ్‌ లాంచ్‌

స్టార్‌ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ”ఫ్యామిలీ స్టార్‌” సినిమా నుంచి థర్డ్‌ సింగిల్‌ ‘మధురము కదా..’ లిరికల్‌ సాంగ్‌ను హైదరాబాద్‌లోని మై హౌమ్‌ జెవెల్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో హౌలీ వేడుకల మధ్య గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌, నిర్మాత దిల్‌ రాజు పాల్గొన్నారు. ”ఫ్యామిలీ స్టార్‌” సినిమా టీమ్‌కు మై హౌమ్‌ జెవెల్‌ ఫ్యామిలీస్‌ హార్టీ వెల్‌ కమ్‌ చెప్పారు. మూవీ టీమ్‌ తో హౌలీ ఆడుతూ, కలిసి డ్యాన్సులు చేస్తూ, ఫొటోస్‌ తీసుకుంటూ సందడి చేశారు. ఇప్పటిదాకా రిలీజ్‌ చేసిన ”ఫ్యామిలీ స్టార్‌” పాటలన్నీ ఇన్‌ స్టంట్‌గా ఛాట్‌ బస్టర్స్‌ అవుతున్నాయి. థర్డ్‌ సింగిల్‌ ‘మధురము కదా..’ లిరికల్‌ సాంగ్‌ కూడా వినగానే మ్యూజికల్‌ లవర్స్‌ ను ఆకట్టుకుంటోంది. ”ఫ్యామిలీ స్టార్‌” సినిమా ట్రైలర్‌ను ఈ నెల 28న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

➡️