నన్ను నేనే…

Mar 11,2024 08:23 #sahityam

నా భయం నేనే అని తెలియక
ఎవరి తోడు కోసమో ఎదురు చూసా…
నాతో మాట్లాడు కోవడం తెలియక
ఎవరి గొంతు కోసమో
పడికాపులు కాచా …
నా నడకలకు అందాన్ని అద్దలేక
దారి ఎత్తుపల్లాలను తప్పు పట్టా…

నాకు ఉన్నది మరచి
లేని దాన్ని ప్రేమించి పూజించా…
నాకు అక్కరలేని
ఇష్టాలను ఆహ్వానిస్తూ
నన్ను నేనే అవమానించుకున్నా…

– చందలూరి నారాయణరావు
9704437247

➡️