మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ హౌస్ అరెస్ట్

Mar 22,2024 11:07 #West Godavari District

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వ్యక్తి డా.అంబేడ్కర్ ని సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో కొందరు దళిత నేతలు పెనుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసారు. ఆందోళన చేసిన 20 మంది దళిత యువకులను పోలీస్ స్టేషన్ నకు తరలించారు. దళిత యువకులను పోలీస్ స్టేషన్ నకు తరలించారని విషయం తెలుసుకున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ పెనుగొండ పోలీస్ స్టేషన్ కు బయిలిదేరకుండా పాలకొల్లులోని ఆయన ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. యలమంచిలి సబ్ – ఇన్ స్పెక్టర్ ప్రసాద్, పాలకొల్లు రూరల్ సబ్-ఇన్ స్పెక్టర్ హరికృష్ణ, పాలకొల్లు రూరల్ హెడ్ కానిస్టేబుల్ మూర్తి బృందం బయటకు కదలనీయకుండా శుక్రవారం ఉదయం నుండి హౌస్ అరెస్ట్ చేసారు.

➡️