రికార్డుస్థాయిలో ఉపాధి కల్పించిన లూలా ప్రభుత్వం

Dec 30,2023 16:46 #Brazil

 

బ్రెసిలియా : రికార్డుస్థాయిలో ఆ దేశ ప్రజలకు మరోసారి లూలా ప్రభుత్వం ఉపాధి కల్పించింది. బ్రెజిల్‌లో ఈ ఏడాది చివరలో సెప్టెంబర్‌- నవంబర్‌ 2023 నెలల మధ్య కాలంలో 100.5 మిలియన్ల మందికి లూలా ప్రభుత్వం ఉపాధి కల్పించినట్లు బ్రెజిలియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోగ్రఫీ అండ్‌ స్టాటిస్టిక్స్‌ (ఐబిజిఇ) నివేదిక పేర్కొంది. 2022 సెప్టెంబర్‌ – నవంబర్‌ కాలంతో పోల్చితే ఈ ఏడాది 515,000 మందికి ఉద్యోగాలు లభించాయని ఐబిజిఇ నివేదిక తెలపింది. గత నెల నవంబర్‌ నెలలో లూలా అవలంచిన ఆర్థిక విధానాల వల్ల 130,000 కొత్త ఉద్యోగాలు సృష్టించినట్లు స్థానిక మీడియా సెంట్రల్‌ డా పొలిటికా తెలిపింది. 2021లో న్యూ స్టాటిస్టికల్‌ మోడల్‌ను అమలులోకి తెచ్చినప్పటి నుండి 100 మిలియన్ల ప్రజలకు ఉపాధి కల్పించిన రికార్డును ఈ ఏడాది త్రైమాసికంలో రెండోసారి అధిగమించింది. ఈ రికార్డు కొనసాగింపుగానే నవంబర్‌ నెలలో మరికొన్ని ఉద్యోగాలను లూలా ప్రభుత్వం కల్పించినట్లు మీడియా వెల్లడించింది. ఈ ఏడాది అన్ని రంగాలు అభివృద్ధిని చవిచూశాయి. వ్యవసాయం, పశువులు, మత్స్య రంగాల్లో 4.3 శాతం వృద్ధి తగ్గింది. అయితే రవాణా, పోస్టల్‌ రంగాల్లో గతేడాది 2022 త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది 4.3 శాతం వృద్ధి నమోదైంది.

కాగా సెప్టెంబర్‌ – నవంబర్‌ల నెలల మధ్య కాలంలో 8.2 మిలియన్ల మంది దేశంలో నిరుద్యోగులుగా ఉన్నారు. గతేడాది త్రైమాసికంలో 8.1 శాతం ఉన్న నిరుద్యోగం ఈ ఏడాది త్రైమాసికంలో 0.6 శాతం పాయింట్లు తగ్గింది. ఈ ఏడాది ఒక్క నవంబర్‌లోనే 39.4 మిలియన్ల బ్రెజిలియన్లు ఉపాధి పొందారు. ఇక అనధికారికంగా ఉపాధి పొందిన వారు 39.2 శాతంగా ఉంది. 2012 నుంచి బ్రెజిల్‌లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. అందుకే నెలవారీ నిరుద్యోగరేటును పరిగణనలోకి తీసుకునేవారు. అయితే ప్రస్తుతం త్రైమాసానికొకసారి నిరుద్యోగ రేటును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.

➡️