హైదరాబాద్‌లో లారీ బీభత్సం

Apr 18,2024 11:05 #hyderabad, #Lorry disaster

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లోని ఎల్బీ నగర్‌ సమీపంలో ఓ లారీ డ్రైవర్‌ బీభత్సం సఅష్టించాడు. ఓ బైక్‌ రైడర్‌ ను ఢ కొట్టడమే కాకుండా ఆపకుండా బైక్‌ ను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. దాదాపు 2 కిలోమీటర్లపాటు దూసుకెళ్లి అక్కడ మరో కారును ఢకొీట్టాడు. ఎట్టకేలకు లారీ డ్రైవర్‌ ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఫ్లై ఓవర్‌ దిగే క్రమంలో.. చాంద్రాయణగుట్ట నుంచి ఎల్బీ నగర్‌ వైపు వెళ్తున్న ఓ లారీ.. ఒవైసీ ఫ్లై ఓవర్‌ దిగే సమయంలో ఓ బైక్‌ ను శనివారం అర్ధరాత్రి ఢ కొట్టింది. లారీ ముందు చక్రాల కింద బైక్‌ ఇరుక్కుపోయింది. దీంతో బైక్‌ పై ఉన్న మాజిద్‌ అనే యువకుడు కిందపడిపోయాడు. అయితే అదఅష్టవశాత్తూ అతనికి పెద్దగా గాయాలేవీ కాలేదు. వెంటనే అక్కడున్న స్థానికులు మాజిద్‌ ను పైకి లేపి లారీ డ్రైవర్‌ ను కిందకు దిగాలంటూ గట్టిగట్టిగా అరిచారు. దీంతో భయపడిన లారీ డ్రైవర్‌ బైక్‌ ను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. అతన్ని అడ్డుకునేందుకు ఓ యువకుడు లారీ ఎడమ వైపు ఉన్న క్యాబిన్‌ పైకి ఎక్కి నిల్చున్నా లారీ డ్రైవర్‌ లెక్క చేయలేదు. రోడ్డుపై రాపిడికి బైక్‌ నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. కొంత దూరం వెళ్లాక లారీ కింద ఇరుక్కున్న బైక్‌ పక్కకు పోవడంతో లారీ డ్రైవర్‌ మరింత స్పీడ్‌ గా నడిపాడు. బైక్‌ పై లారీని వెంబడిస్తున్న మరో ఇద్దరు యువకులు సెల్‌ ఫోన్‌ లో ఈ వీడియోను రికార్డు చేశారు. అలా దాదాపు 2 కిలోమీటర్లు దూసుకెళ్లాక ఓ కారును ఢకొీట్టి లారీ ఆగిపోయింది. అనంతరం స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. లారీ క్యాబిన్‌ పై నిలబడిన వ్యక్తి సైతం గాయాలేవీ కాలేదు. అతను దిగి వెళ్లిపోయాడు. లారీ డ్రైవర్‌ ను పఅథ్వీరాజ్‌ గా గుర్తించామని.. అతన్నిఅరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించామని ఐఎస్‌ సదన్‌ పోలీసులు తెలిపారు. అయితే క్యాబిన్‌ పై నిల్చున్న వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉంది.

➡️