తన ఆరోగ్య రహస్యమేంటో రివీల్‌ చేసిన భాగ్యశ్రీ

Jan 3,2024 12:31 #Bhagyashree, #movie

ఇంటర్నెట్‌డెస్క్‌ : బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, హీరోయిన్‌ భాగ్యశ్రీ కలిసి నటించిన చిత్రం ‘ప్రేమ పావురాలు’. ఈ చిత్రంతో భాగ్యశ్రీ భారీ క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె వివాహం చేసుకుని కొన్నాళ్లు నటనకు దూరమైంది. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ మూవీతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. అయితే తాజాగా ఆమె తన ఆరోగ్య సీక్రెట్‌ని బయటపెట్టింది. అదేంటంటే.. తాను రోజూ జిమ్‌లో వర్కవుట్స్‌ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగుతుందట. కూల్‌డ్రింక్స్‌ కన్నా.. కోకోనట్‌ వాటర్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది అని తాజాగా ఆమె తన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టును చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కొబ్బరినీటిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువ. తీపిగా ఉన్నా చక్కెరస్థాయిలు తక్కువ. నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు తాగితే వెంటనే శక్తి వస్తుంది. అందుకే వైద్యులు కూడా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కొబ్బరినీటిని తీసుకోమని సలహా ఇస్తారు. అయితే డయాబెటిక్స్‌ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో చక్కెరస్థాయిలో ఎక్కువగా ఉంటే.. కొబ్బరినీటిని తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు కొబ్బరినీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

https://www.instagram.com/reel/Csk8OIrAXe3/?utm_source=ig_web_copy_link

➡️