ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, ప్రముఖ నటి శృతి హాసన్ ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో కలిసి నటించారు. ఈ మ్యూజిక్ వీడియో పేరు ఇనిమెల్. ఈ ఒక్క సాంగ్ చూస్తే.. ఒక సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సాంగ్‌ని డైరెక్ట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌లో ఒక డేటింగ్ యాప్ ద్వారా శృతి, లోకేష్ కలుస్తారు. మొదటి డేట్లోనే వారు సినిమాకు వెళ్తారు. ఆ సినిమా పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. ఇద్దరూ ప్రేమించుకోవడం, ప్రపోజ్ చేసుకోవడం, రిజిష్టర్ మ్యారేజ్ చేసుకోవడం, పెళ్లి తర్వాత చిన్న చిన్న గొడవలకే విడాకులు తీసుకొని విడిపోవడం తెరపై కనిపిస్తుంది. అయితే ఆ సినిమాలో పాత్రల్లా విడిపోకుండా.. చివరకు శృతికి లోకేష్ సారీ చెప్పడంతో మళ్లీ వారి ప్రేమ కంటిన్యూ అవుతున్నట్లు సాంగ్‌లో చూపించారు. ఈ సాంగ్‌కి శృతి మ్యూజిక్ అందించడమే కాకుండా ఆ పాటను పాడి ఆకట్టుకుంది. అంతేకాదు ఈ పాటకి విశ్వనటుడు కమల్‌హాసన్ లిరిక్స్ రాశారు. చిన్న చిన్న గొడవల వలన భార్యాభర్తలు ఎలా విడిపోతున్నారనేది ఈ సాంగ్‌లో చూపించడం విశేషం.