ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్న లేఖలు

ప్రభుత్వ వైపల్యాలను ప్రశ్నిస్తున్నందుకే నరేంద్రపై అక్రమకేసులు : అచ్చెన్నాయుడు
  • దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదుపై ఒకటి
  • ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయంపై మరొకటి 

ప్రజాశక్తి-మంగళగిరి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రధానాధికారికి రెండు లేఖలు రాశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సీఈసీకి ఆయన ఫిర్యాదు చేశారు. 2021-22 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, అక్రమల కేసుల పెట్టి అరెస్టు చేయించారని విమర్శించారు. ఇప్పుడు అదే నేర వృహాన్ని పునరావృతం చేస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌పై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. రాజకీయ ప్రచారంలో సచివాలయ వాలంటీర్ల ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని సీఈసీకి మరో లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల కార్యకలాపాల్లో వాలంటీర్లు పాల్గొనకుండా చూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించిందని తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం తరుపున వాలంటీర్లు డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించారని వెల్లండించారు. వాలంటీర్లు తన సైన్యం అంటూ ముఖ్యమంత్రి అభివర్ణించారని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లను ఎంచుకునే సీనియర్ సిటిజన్లకు దరఖాస్తులను సులభతర చేయమని వాలంటీర్లకు చెప్పిన మంత్రి ధర్మనపై కూడా అచ్చెన్న ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారాలకు సహకరించాలని వాలంటీర్లకు 15 రోజులుగా వైకాపా నాయకులు డబ్బు, బహుమతులు ఇస్తున్నారని తెలిపారు. వాలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు ఇస్తున్నందున, రాజకీయ ప్రచారం చేయడం అనైతికమన్నారు. ఈ విషయాన్ని అత్యవసర అంశంగా పరిగణలోనికి తీసుకొని రాజకీయ ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయాన్ని నిషేధించాలని అచ్చెన్న కోరారు.

➡️