భారత రాజ్యాంగ పరిరక్షణకై ప్రతిన బూనుదాం

Apr 14,2024 22:12

 ప్రజాశక్తి- బొబ్బిలి : పట్టణంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయగౌరి మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. మన భారత రాజ్యాంగం గొప్పతనాన్ని విద్యార్థులకు అర్ధమయ్యే విధంగా చెప్పాలని జిల్లా సహాధ్యక్షులు ప్రసన్నకుమార్‌ అన్నారు. విభిన్న భాషలు,మతాలు, కులాలు, భిన్న సంస్కృతులు కలిగిన మన దేశంలో సమైక్యత కోసం రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో మహనీయుడు రూపొందిం చారని సమావేశంలో పాల్గొన్న మన్యం జిల్లా నాయకులు మధుసూధనరావు, సత్యన్నారాయణ, అప్పలనాయుడు, శ్రీనివాస్‌, అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణదాసు, రమేష్‌, శ్రీనివాస్‌, మహేష్‌, రామకృష్ణ, జగదీష్‌, వెంకటరావు, పారినాయుడు, శంకరరావు పాల్గొన్నారు.సిఐటియు ఆధ్వరంలోరాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ఈనాటి పాలకులు పూనుకుంటున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకర్రావు అన్నారు. పట్టణంలోని అంబ్కేదర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. న్యాయ వ్యవస్థను, రాష్ట్రాల హక్కులను, పౌర హక్కులను, రాజ్యాంగంలో కల్పించిన ప్రజల హక్కులను ఈనాటి పాలకులు కాలరాస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జి. గౌరీ, జె. రామారావు కార్యకర్తలు బి.వెంకటి, జి. వాసు తదితరులు పాల్గొన్నారు.రామభద్రపురం: బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్‌ అని సిఐటియు మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా స్థానిక ఎగువ హరిజన వీదిలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని పరిరక్షించడానికి అంబేద్కర్‌ ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా నాయకులు అరుణ, సింహా చలం, వెంకటి, పాపమ్మ, పద్మమ్మ, లక్ష్మమ్మ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.నెల్లిమర్ల: అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని సిపిఎం నాయకులు కిల్లంపల్లి రామారావు అన్నారు. ఆదివారం జరజాపుపేట దళిత కాలనీలో దళితులతో కలిసి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామారావు మాట్లాడుతూ దళిత, గిరిజన, వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్‌ ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఉండ్రు రామారావు, రాచర్ల కృష్ణ, మాత కృష్ణ, ములపర్తి బాబురావు, సారికి రమణ తదితరులు పాల్గొన్నారు.కొత్తవలస: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా సిపిఎం నాయకులు గాడి అప్పారావు, దళిత సంఘ నాయకులు, తహశీల్దార్‌ కార్యాలయ సిబ్బంది అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను సాధిస్తామని నినాదాలు చేశారు. కొత్తవలస జంక్షన్‌, గాంధీనగర్‌, ఎమ్మార్వో కార్యాలయం, చింతలపాలెం, ఎస్‌సి కాలనీ, తదితర ప్రాంతాల్లో అంబేద్కర్‌ ఉత్సవాలు ఘనంగా జరిపారు.

➡️