ఈ నెల 21న అంజు ఆసుపత్రి లో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం

Mar 19,2024 16:08 #Konaseema

ప్రజాశక్తి -మామిడికుదురు : మామిడికుదురు అంజు కంటి ఆసుపత్రి ఆవరణలో ఈ నెల 21గురువారం స్విట్జర్లాశీడ్ విజన్ పర్ ఆల్ వారి సహకారం తో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం ఏర్పాటు చేసినట్లు డవలప్మెంట్ మేనేజర్ పల్లి స్వామి వందనం మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. అంతర్జాతీయ కంటి వైద్య నిపుణులు డా తేజ(రెటినరీ సెర్స్ స్కాలర్ ), విజన్ పర్ ఆల్ ప్రతినిధి డా ఆంద్రీ మెర మెన్డ్ గ్లకోమా స్పెషలిస్ట్ వారి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం,  కంటి శుక్లం ఆపరేషన్ చేయబడునన్నారు. జిల్లాలో వృద్యాపం లో వచ్చు కంటి శుక్లం ఆపరేషన్ ఉచితంగా చెయించుకునుటకు ఆధార్ కార్డు ద్వారా నమోదు సేయించు కోవాలని తెలిపారు. నిరుపేదలైన వారికి ఉచితంగా కంటి లోపల అద్దం వేసే పద్దతి లో కంటి శుక్లం (కేటరాక్ట్) (పువ్వు )ఆపరేషన్ చేయించుకొనుటకు అదే రోజు పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ శిబిరం లో కంటి శుక్లం ఆపరేషన్చెయించుకోలేని వారికి అత్యాధునిక పరికరం లతో కోత పద్దతిలో స్మాల్ ఇన్సష న్ కేటరాక్ట్ సర్జరీ చేయబడునన్నారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్లను 8333851155,9908266668 సంప్రదించలన్నారు.

➡️