కార్మిక, రైతాంగ సమ్మెను జయప్రదం చేయాలి

Feb 4,2024 22:20

ప్రజాశక్తి – రేపల్లె
కార్మిక, రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 16న గ్రామీణ ప్రాంత సమ్మెలో అంగన్‌వాడీలంతా పాల్గొని జయప్రదంచేయాలని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్ కోరారు. స్ధానిక సీఐటీయు కార్యాలయంలో 42రోజులు సమ్మెలో గుర్తించిన అంగన్‌వాడి కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహించారు. అంగన్‌వాడి యూనియన్ జిల్లా అద్యక్షరాలు కె ఝాన్సి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేతనాలు అమలు చేయాలని, అంగన్‌వాడీల పోరాటం నిర్వహించినప్పటికి ప్రభుత్వం అంగన్‌వాడీలకు కల్పించవలసిన హక్కుల మీద బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతాంగం, కార్మికులు ఉమ్మడిగా ఫిబ్రవరి 16న గ్రామీణ సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్మికులందరికీ కనీసవేతనాలు అమలు చేయాలని,పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని, డిమాండ్స్ జయప్రదం కొరకు కార్మిక వర్గం అందరూ సిద్ధం కావాలని కోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకున్న హక్కులను హరిస్తుందని ధరలు పెద్ద ఎత్తున పెంచుతుందని, మతం పేరుతో కార్మికుల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం అంతా ఏకతాటి మీదకు వచ్చి ఆందోళన నిర్వహించాలని అన్నారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై అంగన్‌వాడీలు చారిత్రాత్మకంగా పోరాటం నడిపారని అన్నారు. ప్రభుత్వం నాలుగేళ్లపాటు కార్మికులను రోడ్లమీదకి రాకుండా నిర్బంధాన్ని ప్రయోగించిందని, అయినప్పటికీ కార్మికులు ధైర్యంతో పోరాటంచేసి కొన్ని హక్కుల సాధించుకున్నారని అన్నారు. భవిషత్తులో పోరాటాల కొసం సిద్దం చేయటం కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో పల్లపట్ల ప్రాజెక్ట్ అద్యక్షరాలు వై మేరిమణి, అమర్తలురు ప్రాజెక్ట్ కె రమాదేవి, ఎస్ఎఫ్ఐ నాయకులు పి మనోజ్, సీఐటీయు నాయకులు, అంగన్‌వాడి యూనియన్ నాయకులు ఎన్ కృష్ణకుమారి, ఉషారాణి, నిర్మలజ్యోతి, గృహలక్ష్మి, జ్యోతి, రజిని, కె ఆశీర్వాదం, కె రమేష్ పాల్గొన్నారు.

➡️