పలు రికార్డు బ్రేక్‌ చేసిన కింగ్‌ కోహ్లీ

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) తో జరిగిన మ్యాచ్‌లో రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ పలు రికార్డులు నెలకొల్పాడు. ఓపెనర్‌గా వచ్చిన విరాట్‌ 59 బంతుల్లోనే 83 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు కోల్‌కతాపై 33 మ్యాచులు ఆడిన విరాట్‌ 944 పరుగులు చేశాడు. ఇంతకుముందు మూడో స్థానంలో 907 రన్స్‌తో శిఖర్‌ ధావన్‌ ఉన్నాడు. ఇక ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో డేవిడ్‌ వార్నర్‌ (1075), రోహిత్‌ శర్మ (1040) ఉన్నారు.
అలాగే ఒకే వేదికలో అత్యధిక టీ20 రన్స్‌ (3,276) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం పేరిట ఉండేది. మీర్పూర్‌ వేదికగా అతడు ఇప్పటివరకు 3,239 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున అత్యధిక సిక్సులు (241) కొట్టిన బ్యాటర్‌గా కింగ్‌ కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్‌ ప్లేయర్‌ క్రిస్‌ గేల్‌ (239) పేరిట ఉండేది. అతడు కూడా ఆర్‌సీబీ తరఫున 239 సిక్సులు బాదాడు. గేల్‌ తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్‌ (ఆర్‌సీబీ -238), కీరన్‌ పొలార్డ్‌ (ఎంఐ-221), రోహిత్‌ శర్మ (ఎంఐ-210) ఉన్నారు.

➡️