కర్లపూడి గ్రామ వాలింటిర్లు రాజీనామా

Apr 20,2024 16:01 #tirupathi

ప్రజాశక్తి -కోట : కోట మండలంలోని కర్లపూడి పంచాయతి లో 5 మంది గ్రామ వాలింటిర్లు రాజీనామా చేశారు.ఈ సందర్బంగా శనివారం కోట ఎంపిడిఓ కార్యాలయంలో స్థానిక ఎంపిడిఓ శంకరయ్య కు కర్లపూడి గ్రామ వాలింటిర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని రాజీనామా పత్రాలను అందజేయడం జరిగిందని వారు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తాము పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

➡️