సమస్యల వలయములో జూనియర్ కళాశాల

Nov 23,2023 13:39 #Anantapuram District

ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలతో కొట్టు పెడుతున్నట్లు గ్రామస్తులు అన్నారు. ఈ ప్రభుత్వ కళాశాల నందు మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 242 మంది రెండవ సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 119 మంది విద్యాభ్యాసం పొందుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు తెలిపారు అంతేకాకుండా కళాశాల నేడు నాడుకు ఎంపీ కావడం శుభసూచికమన్నారు. 52 లక్షల రూపాయలు నిధులు మంజూరైనాయని 26 లక్షల రూపాయలు మెటీరియల్ కోసం 28 లక్షల రూపాయలు నిర్మాణం కోసం ఉపయోగించామని వారు తెలియజేశారు. కళాశాల నందు బాలికలు 100 మంది దాకా విద్యాభ్యాసం పొందుతున్నారని వీరికి మరుగుదొడ్లు లేక ఆరుబయట కళాశాల ఆవరణంలో కాలం గడుపుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కళాశాలకు వచ్చే విద్యార్థులందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు 100% ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన బాలికల కావడం విశేషం. గతంలో ఒక మరుగుదొడ్డి ఉండేది ఆ మరుగుదొడ్డి కళాశాల సిబ్బంది ఉపయోగించడం వల్ల విద్యార్థులకు ప్రత్యామ్ లేకపోవడం పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు అంటున్నారు. కళాశాల నిర్మాణం మరమ్మత్తులు నత్తనడక సాగుతున్నాయని సకాలంలో నిధులు రాకపోవడం ఇబ్బందికరంగా ఉన్నట్లు కళాశాల కమిటీ అధ్యక్షులు అన్నారు. యుక్త వయసు బాలికలు వారు నిత్యవసరాలు తాగునీరు బోరుబాగుపై ఆధారపన్నారని విద్యుత్ ఉంటే శుద్ధ నీరు లేకపోతే బోరు నీళ్లే మాకు వినియోగానికి అంటున్నారు. కళాశాలకు వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యాలు చాలా గ్రామాలకు లేకపోవడం విద్యార్థులు కాలినడకనే ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడవవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నాలుగే గ్రూపులు ఉన్నాయని మిగిలిన గ్రూపులు లేకపోవడం వల్ల కొంతమంది అనంతపురం కళ్యాణ్ దుర్గం బళ్లారి పట్టణాలకు వలస వెళ్లినారని తెలిపారు.

➡️