జపాన్ హెచ్3 రాకెట్‌ విజయవంతం 

Feb 17,2024 11:13 #Japan, #Space

కగోషిమా : సంవత్సరాలుగా ఆలస్యం అవుతూ, ఇప్పటికే రెండుసార్లు వైఫల్యం అయిన జపాన్ కొత్త ఫ్లాగ్‌షిప్ రాకెట్‌ను(హెచ్3) శనివారం(ఫిబ్రవరి 17) విజయవంతంగా ప్రయోగించింది. విఫల ప్రయత్నాల తర్వాత మూడవ ప్రయత్నంలో హెచ్3 విజయం సాధించినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) ప్రకటించింది.

సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో హెచ్3 రాకెట్ ను అంతరిక్ష సంస్థ జాక్సా తయారు చేసింది. నైరుతి జపాన్‌లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 9.22 గంటలకు రాకెట్ ప్రయోగించిన తర్వాత “కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది” అని జక్సా అధికారి ఎ.ఎఫ్.టికి తెలిపారు. గత నెలలో చంద్రునిపై మానవరహిత ప్రోబ్ విజయవంతంగా ల్యాండింగ్ చేసిన జపాన్ తాజా ప్రయోగంతో భూమి యొక్క ఉపగ్రహంలో క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన ఐదవ దేశంగా నిలిచింది.

➡️