చుట్టూ మంచు.. చలికి వణికిపోతూనే పిల్లలకు పోలియో చుక్కలు : వీడియో వైరల్‌

Mar 5,2024 13:14 #trending twitter

జమ్మూ కాశ్మీర్‌ : చిన్నారుల ఆరోగ్యం కోసం మార్చి 3వ తేదీన దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియా కార్యక్రమం జరిగింది. ఈ పల్స్‌ పోలియో ఇమ్యూనజైషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్‌ వేస్తారు. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో చిన్నారులకు పోలియో డ్రాప్స్‌ వేయడం మాములే. కానీ గడ్డ కట్టే చలిలో.. చుట్టూ మంచు కప్పబడి.. వెళ్లేందుకు దారి కూడా లేని జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలోని సుఖ్‌నై గ్రామంలోని ఆరోగ్య సంరక్షణా కేంద్రానికి ఓ మహిళా హెల్త్‌ వర్కర్‌ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ వీడియో చూస్తే మాత్రం మహిళలు తమ విధుల్ని ఎంత నిబద్ధతతో చేస్తారో తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 

➡️