జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం : సిపిఐ

Feb 9,2024 10:36 #CPI, #D. raja

న్యూఢిల్లీ : ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి సిపిఐ ప్రధానకార్యదర్శి డి రాజా బృందం ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేసింది. సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమైన, రాజ్యాంగ విరుద్ధమైన ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరారు. ‘బహుళ పార్టీ ప్రజాస్వామ్యం, అపారమైన వైవిధ్యం ఉన్న మనదేశంలో ‘జమిలి’ ఎన్నికలు అసాధ్యం. రాజ్యాంగానికి విరుద్ధం’ అని రాజా పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన అప్రజాస్వామికమని, సమాఖ్య నిర్మాణానికి పూర్తి వ్యతిరేకమని ఆయన విమర్శించారు.

➡️