జకో, సిన్నర్‌ శుభారంభం

Jan 14,2024 22:12 #Sports

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ శుభారంభం చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌ పోటీలో జకోవిచ్‌ 6-2, 6-7(5-7), 6-3, 6-4తో అన్‌సీడ్‌, క్రొయేషియాకు చెందిన పిజ్కక్‌ను చిత్తుచేశాడు. ఇతర పోటీల్లో 4వ సీడ్‌, పోలండ్‌కు చెందిన సిన్నర్‌ 6-4, 7-5, 6-3తో జాండ్‌స్యుల్స్‌((నెదర్లాండ్స్‌), 5వ సీడ్‌ రుబ్లేవ్‌(రష్యా) 7-5, 6-4, 3-6, 4-6, 7-6(10-8)తో ఐదు సెట్ల హోరాహోరీ పోరులో బ్రెజిల్‌కు చెందిన తియారోపై చెమటోడ్చి నెగ్గాడు. ఇతర పోటీల్లో 12వ సీడ్‌ ఫ్రిట్జ్‌(అమెరికా) 26వ సీడ్‌ బజ్‌(అర్జెంటీనా), ప్రత్యర్ధుతలను చిత్తుచేసి రెండోరౌండ్‌కు చేరారు. సబలెంకా సునాయాసంగా.. మహిళల సింగిల్స్‌లో 2వ సీడ్‌ సబలెంక(రష్యా) సునాయాసంగా ప్రత్యర్ధిని చిత్తుచేసింది. ఆదివారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో సబలెంక 6-0, 6-2తో సీడెల్‌(జర్మనీ)పై గెలుపొందింది. మరో పోటీలో 8వ సీడ్‌ సక్కారి(గ్రీక్‌) 6-4, 6-1తో హీబినో(జపాన్‌)పై, 9వ సీడ్‌ క్రేజికోవా(చెక్‌) 2-6, 6-4, 6-3తో హంటామా(జపాన్‌)ను చిత్తుచేసి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు.

➡️