ఘనంగా జరిగిన అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ వివాహం

Jan 4,2024 12:02 #AAMIR KHAN, #IRA-NUPUR, #movie, #wedding

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరాఖాన్‌ వివాహం బుధవారం (జనవరి 3) ఘనంగా జరిగింది. తాను ప్రేమించిన నుపుర్‌ శిఖరేను ఐరా పెళ్లాడింది. నిన్న ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో ముంబైలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వీరు రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత అదే హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా జరిగింది. నిన్న కేవలం కొద్దిమంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ నెల 8వ తేదీన రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌లో ఈ జంట మరోసారి వివాక వేడుక జరుపుకోనుంది. సినీ ఇండిస్టీలోని సెలబ్రిటీలు, సన్నిహితుల కోసం ఈ నెల 13న ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

వరుడు నుపుర్‌ శిఖరే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కావడంతో.. పెళ్లి జరిగే చోటుకు ఎనిమిది కిలోమీటర్లు జాగింగ్‌ చేసుకుంటూ వచ్చాడు. వెరైటీగా జాగింగ్‌ డ్రెస్‌లోనే అతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రిసెప్షన్‌కి కోటు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు.

అమీర్‌ఖాన్‌ – రీనా దత్తల కుమార్తె ఐరా ఖాన్‌. అమీర్‌ఖాన్‌కి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్న సమయంలోనే నుపూర్‌కి ఐరాకి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. వీరి నిశ్చితార్థం 2022 నవంబర్‌లో జరిగింది.

➡️