అంతరిక్షంలో అంతర్జాలం

Apr 2,2024 23:17 #22 satellites, #launched, #SpaceX

– 22 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌
లాస్‌ఏంజెల్స్‌ : అంతరిక్షంలో ఉంటూనే అంతర్జాల సేవల కోసం 22 ఉపగ్రహాలను వ్యోమనౌక స్పేస్‌ ఎక్స్‌ విజయవంతంగా ప్రయోగించింది. అమెరికా ప్రైవేట్‌ రోదసీ కంపెనీ అయిన స్పేస్‌ఎక్స్‌ సోమవారం ఈ 22 స్టార్‌లింక్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.30గంటలకు కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ స్పేస్‌ఫోర్స్‌ స్థావరం నుండి ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్ళిందని స్పేస్‌ ఎక్స్‌ తెలిపింది. ఫాల్కన్‌ 9 మొదటి దశ బూస్టర్‌ పసిఫిక్‌ సముద్రంలో ఆగిన డ్రోన్‌ షిప్‌పై ల్యాండ్‌ అయింది. అందుబాటులో స్టార్‌లింక్‌ అత్యధిక వేగం గల బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్‌నెట్‌ను అందుబాటులో లేని ప్రదేశాలకు కూడా అందచేస్తుందని స్పేస్‌ ఎక్స్‌ తెలిపింది.

➡️