ఎనర్జీ డ్రింక్స్‌ తాగితే నిద్రలేమి సమస్యలు

Jan 31,2024 16:28 #Energy, #health

ఇంటర్నెట్‌డెస్క్‌ : నేటికాలంలో యూత్‌లో చాలామంది ఎనర్జీ డ్రింక్స్‌ తాగుతారు. ఈ ఎనర్జీ డ్రింక్స్‌ వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్‌, షుగర్‌, ఇతర రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రబావం చూపుతాయి. మరి అవేంటో తెలుసుకుందామా..!

– ఎనర్జీ డ్రింక్స్‌ గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి తాగితే.. హృదయ స్పందన రేటును వేగవంతం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.

– మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.- ఎనర్జీ డ్రింక్స్‌ విశ్రాంతికి తీవ్ర భంగం కలిగిస్తాయి. నిద్ర పోనివ్వడానికి సహాయపడవు. అందుకే నిద్రపోయేముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డ్రింక్స్‌ని తాగవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

– యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అత్యధికులు ఈ ఎనర్జీ డ్రింక్స్‌ తరచూ తాగుతుంటారు. దీంతో వారు నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారని పలు పరిశోధనలు వెల్లడించాయి.

– విద్యార్థులు ఎక్కువసేపు మేల్కొని చదువుకోవాలంటే హెర్బల్‌ టీ, గ్రీన్‌ టీ వంటివి తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

– ఎవరైనా సరే తక్షణమే శక్తి పొందాలంటే లెమన్‌ జ్యూస్‌, ఆరెంజ్‌ జ్యూస్‌ వంటివి తాగితే మంచిది. ఈ జ్యూస్‌లు ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవు.

➡️