ఇకపై నో ‘వీసా’.. మలేషియా, థాయిలాండ్‌ జాబితాలో ఇండోనేషియా ..!

 జకార్తా :   మలేషియా, శ్రీలంక, థాయిలాండ్‌ దేశాల జాబితాలో ఇండోనేషియా కూడా చేరనుంది.   భారత్‌, చైనా, అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా 20 దేశాలకు వీసాలేకుండా తమ దేశంలో ప్రయాణించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇండోనేషియా పర్యాటక మంత్రి గురువారం తెలిపారు.   నిబంధనల్లో చేర్చిన దేశాల జాబితాను ప్రభుత్వం ఖరారు చేస్తుందని  పేర్కొన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ మరియు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను పెంచేందుకు వీసా రహిత అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధ్యక్షుడు జోకో విడోడో ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు పర్యాటక మంత్రి శాండియాగా యునో తెలిపారు. అధికారిక నివేదిక ప్రకారం.. 2019 కొవిడ్‌ మహమ్మారికి ముందు 16 మిలియన్లకు పైగా పర్యాటకులు తమ దేశంలో పర్యటించారు. అయితే ఈ ఏడాది జనవరి నుండి అక్టోబర్‌ వరకు కేవలం 9.49మిలియన్ల విదేశీ పర్యాటకులు మాత్రమే సందర్శించారని, 2022 ఇదే కాలంతో పోలిస్తే ఇది 124.3 శాతం పెరిగింది.

➡️