మే 24న ఇండియన్‌-2 విడుదల

Apr 6,2024 19:15 #Kamal Haasan, #movie

శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ నటిస్తున్న చిత్రం ‘ఇండియన్‌-2’. కొన్నేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. సమ్మర్‌ స్పెషల్‌గా మే 24న ఈ సినిమా విడదల కానుంది. 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ భారతీయుడుకు ఇది సీక్వెల్‌. ఇందులో కమల్‌తోపాటు కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ్‌, సముద్రగని, బాబీ సింహా తదితరులు నటించారు. ఈ సినిమా తొలి భాగానికి ఎఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందించగా, రెండో భాగానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత స్వరాలు సమకూర్చారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని తుదిదశ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తిచేసుకున్న ఈ మూవీని సమ్మర్‌ స్పెషల్‌గా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

➡️