ఒకే గ్రూప్‌లో భారత్‌, పాకిస్తాన్‌

Jan 6,2024 11:15 #Cricket, #Sports, #Team India
  • జూన్‌ 9న ఇరుజట్ల మధ్య గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌
  • టి20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

దుబాయ్: టి20 ప్రపంచకప్‌ 2024 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) శుక్రవారం విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి టి20 ప్రపంచకప్‌ మెగా టోర్నీ ప్రారంభమవుతుందని ఐసిసి అధికారిక ప్రకటన చేసింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢ కొట్టనుంది. ‘గ్రూప్‌ ఏ’లో ఉన్న భారత్‌-పాక్‌ జట్లు న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న తలపడనున్నాయి. అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా 2024 టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం 20జట్లు టైటిల్‌కు తలపడతున్నాయి. అమెరికాలోని(3) సెయింట్‌ లూసియా, ఆర్నాస్‌ వాలే, సెయింట్‌ విన్సెంట్‌ స్టేడియాల్లో.. వెస్టిండీస్‌లోని(6) కింగ్‌టన్‌, బార్బొడాస్‌, బ్రియాన్‌ లారా, ట్రినిడాడ్‌, ప్రొవిడెన్స్‌, గయానా, వివియన్‌ రిచర్డ్‌, ఆంటిగ్వా, డారెన్‌ సమీ క్రికెట్‌ మైదానాల్లో వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్‌ 26, 27న సెమీఫైనల్‌, 29న బార్బొడాస్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

గ్రూప్‌-ఏ : భారత్‌, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌, అమెరికా, కెనడా,

గ్రూప్‌-బి : ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, నమీబియా, స్కాట్లాండ్‌, ఓమన్‌

గ్రూప్‌-సి : న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఉగాండా, పపువాన్యూయేనియా

గ్రూప్‌-డి : దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌

షెడ్యూల్‌..జూన్‌ 5 : భారత్‌ × ఐర్లాండ్‌(న్యూయార్క్‌)

జూన్‌ 9 : భారత్‌ × పాకిస్తాన్‌(న్యూయార్క్‌)

జూన్‌ 12 : భారత్‌ × అమెరికా(న్యూయార్క్‌)

జూన్‌ 15 : భారత్‌ × కెనడా(ఫ్లోరిడా)

➡️