సిరీస్‌ దక్కేదెవరికో..!

Jan 9,2024 08:34
  • నేడు భారత్‌-ఆస్ట్రేలియా మహిళల చివరి టి20
  • రాత్రి 7.00గం||లకు

ముంబయి: తొలి టి20లో నెగ్గిన భారత మహిళలజట్టు రెండో టి20లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ క్రమంలో సిరీస్‌ చేజిక్కించుకోవాలంటే మంగళవారం జరిగే మూడో, చివరి టి20లో భారత్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు వన్డే సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకొన్న ఆస్ట్రేలియా టి20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలన్న ఆశతో ఉంది. తొలి రెండు టి20ల్లోనూ తొలిగా బ్యాటింగ్‌ చేసిన జట్లు పరాజయాన్ని చవిచూడగా.. ఛేదన దిగిన జట్లు విజయాన్నందుకున్నాయి. టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సేన బ్యాటింగ్‌లో నిరాశపరుస్తోంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. రెండో టి20లో కేవలం 6పరుగులకే పెవీలియన్‌కు చేరింది. వన్డే, టెస్ట్‌ మ్యాచ్‌లోనూ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్‌ చేయలేదు. ఇక షెఫాలీ వర్మ, మంధాన, రోడ్రిగ్స్‌, రీచా ఘోష్‌, దీప్తి శర్మ ఫామ్‌లో ఉండడం కలిసిరానుంది. ఇక బౌలర్ల విషయానికొస్తే.. శ్రేయాంక, తిటాస్‌ సద్ధుకి తోడు దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది.

జట్లు(అంచనా)..

ఇండియా : హర్మన్‌ప్రీత్‌(కెప్టెన్‌), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్టికా భాటియా, రీచా ఘోష్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌, శ్రేయాంక పాటిల్‌, రేణుక, టితాస్‌ సద్ధు, పూజ వస్త్రాకర్‌/కనిక అహుజా

ఆస్ట్రేలియా: ఎలీసా హీలీ(కెప్టెన్‌), బ్రౌన్‌, గార్డినర్‌, కిమ్‌ గ్రాత్‌, కింగ్‌, లిచ్‌ఫీల్డ్‌, తహియా మెక్‌గ్రాత్‌, బెత్‌ మూనీ, ఎలీసా ఫెర్రీ, మెఘన్‌ స్కట్‌, సథర్లాండ్‌/వారేహామ్‌.

➡️