డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు : ఎస్‌బిఐ

Dec 28,2023 21:18 #Business

న్యూఢిల్లీ : దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) తన డిపాజిట్‌దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం వెల్లడించింది. పది నెలల తర్వాత తొలిసారి ఈ రేట్లను పెంచింది. కొత్త రేట్లు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొంది. ఎస్‌బిఐ వెబ్‌సైట్‌ ప్రకారం.. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్లు సవరించడంతో వడ్డీరేటు 3 శాతం నుంచి 3.50 శాతానికి చేరుకుంది. అలాగే 46 నుంచి 179 రోజుల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం పెంచి.. 4.75 శాతానికి చేర్చింది. 1-2 ఏళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 6.8 శాతం, 2-3 ఏళ్ల కాలానికి 7 శాతం, 3-5 ఏళ్ల కాలపరిమితి ఎఫ్‌డిలపై 6.75 శాతం, 5-10 ఏళ్ల ఎఫ్‌డిలపై 6.5 శాతం వడ్డీ రేట్లను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

➡️