వేతనాలు పెంచం : సజ్జల రామకృష్ణారెడ్డి 

  • అంగన్‌వాడీలకు ప్రత్యామ్నాయం చూస్తాం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలకు వేతనాలు పెంచలేమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వేతనాలు పెంచడానికి బదులుగా అంగన్‌వాడీలకు ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ చర్చల్లో ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వంలో వేతనాల పెంపు విషయం పరిశీలిస్తామని చెప్పామని, అయినా సమ్మెను కొనసాగిస్తున్నారని చెప్పారు. తెగేంతవరకు లాగడం మంచిది కాదన్నారు. మొదట్లో అధికారులు, తర్వాత మంత్రుల బందం చర్చలు జరిపారని, వేతనాలు తప్ప అన్ని సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు. అంగన్‌వాడీ కార్మికులు లక్ష మంది ఉన్నామని, తాము అనుకున్నది జరగకపోతే ప్రభుత్వాన్ని దించేస్తాం అనేలా మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ అంగన్వాడీల కింద లక్షలాది మంది మహిళలు, పిల్లలు, గర్భిణులు ఉన్నారన్నారు. ఎక్కడో ఒక పాయింట్‌ వద్ద ప్రభుత్వం ప్రత్యామ్నాయం చేయాల్సి వుంటుందని తెలిపారు. లక్షలాది మందికి సంబంధించిన అంశం అయిన ందునే వీరిపై ఎస్మా ప్రయోగి స్తూ జీఓ తెచ్చా మని అన్నా రు. అంగనవాడీల సమ్మె వెనుక జాతీయ పార్టీలు, లాయర్లు ఉన్నారని వీడియోలో తేలిందన్నారు. ఉద్యమం ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తుందన్నారు. అంగన్వాడీ, మున్సిపల్‌ వర్కర్లు ఎస్మా కిందికి వస్తారని అన్నారు. మున్సిపల్‌ వర్కర్లతో చర్చలు జరుగుతున్నాయన్నారు. సమస్యలు పరిష్కారమవుతామని భావిస్తున్నామన్నారు.

అంగన్‌వాడీలకు షోకాజ్‌ నోటీసులు

అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం తాజాగా అంగన్‌వాడీలకు షోకాజ్‌ నోటీసులివ్వాలని నిర్ణయించింది. విధులకు ఎందుకు హాజరుకాలేదో చెప్పాలని నోటీసులివ్వాని, 10 రోజుల్లోగా సంతృప్తికర సమాధానం ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.

➡️