దళిత ఐక్యవేదిక పోస్టర్‌ ఆవిష్కరణ

Mar 21,2024 00:03

ప్రజాశక్తి – రేపల్లె
దళితులందరూ ఐక్యంగా ఉండాలని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. దళితుల ఆత్మీయ సమావేశం పోస్టర్స్ బుధవారం ఆవిష్కరించారు. ఈనెల 24న క్లాత్ మర్చంట్స్ హల్ నందు నియోజవర్గ స్థాయి దళితుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. దళితుల ఐక్యవేదిక నాయకులు దారం సాంబశివరావు, జుల్లకంటి బుజ్జి మాట్లాడారు. 45వేల ఓటర్లతో నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల ఐక్యత కొరకు, భవిష్యత్తులో అన్ని రంగాల్లో దళితుల అభివృద్ధి కొరకు ఒక వేదికగా ముందుకు వెళ్ళడానికి, దళితుల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్, బాబూజగ్జీవన్ రామ్ యువజన సంఘాలు, దళిత ఎంప్లాయిస్ ఫెడడేరేషన్స్ దళితుల ఆత్మీయ సమావేశంలో ఎస్సి మాదిగ, మాలల ఐక్యత కొరకు, దళిత గ్రామాల అభివృద్ధి కోరకు, కీలక పదవుల్లో దళితులకు రాజకీయ ప్రాధన్యత ఓట్లు సంఖ్య ప్రకారం పెరిగే లా ఉమ్మడిగా చర్చించి ముందుకు వెళ్ళతామని అన్నారు. దళితుల హక్కుల సాధనకోసం, ఐక్యత, అభివృద్ధి, సమానత్వం కోసం జరిగే ఆత్మీయ సమావేశానికి అందరు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు జి ప్రశాంత్, ఎం సుధా చంద్రహాసన్, కొన శ్రీను, నాగేశ్వరరావు, కె సజ్జనరావు, ఎ నాగేశ్వరరావు, కె ప్రతాప్, ఎ కిరణ్, జి కుమార్, సిహెచ్ మణిలాల్, కె మస్తాన్, రామారావు, టి శ్యామ్ పాల్గొన్నారు.

➡️