పఠనా నైపుణ్యాన్ని పెంచాలి

Apr 11,2024 23:38 ##school #panguluru

ప్రజాశక్తి – పంగులూరు
విద్యార్థుల్లో పఠనా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అప్పుడప్పుడు పోటీ పరీక్షలు నిర్వహించాలని విద్యావేత్త పేర్ని వీరనారాయణ అన్నారు. మండలంలోని కోటపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల్లో పేర్ని సుబ్బయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగిన స్పెల్ బి కాంటెస్ట్ విజేతలకు గురువారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే చిన్నప్పటినుండే పోటీ పరీక్షల్లో పాల్గొనాలని సూచించారు. అందులో విజేతలుగా నిలిచేందుకు కృషి చేయాలని కోరారు. పోటీ పరీక్షల ద్వారా పఠనా నైపుణ్యాన్ని పెంచుకొని చదువు పట్ల ఆసక్తితో మెలగాలని అన్నారు. అనంతరం స్పెల్ బి కాంటెస్ట్ విజేతలైన రేణింగవరం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఉదయ్, లోకేస్‌కు ప్రథమ బహుమతి, కోటపాడు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు శ్రావణ్ కుమార్, హేమశ్రీ ద్వితీయ బహుమతి అందుకున్నారు. కొండమంజులూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు పవన్, గోపి, నవీన్ తృతీయ బహుమతిని సాధించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వేణుబాబు, ఉపాధ్యాయులు రామకోటిరెడ్డి, సుబ్బయ్య, శ్రీనివాసరావు, సాంబశివరావు పాల్గొన్నారు.

➡️