పౌరసత్వ సవరణ చట్టం అమలు.. రూల్స్‌ నోటిఫై చేసిన హౌం శాఖ

Mar 11,2024 18:34 #BJP, #CAA, #national

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ చట్టం 2019 డిసెంబరులో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ ఇంతవరకూ దీనిపై నిబంధనలు రూపొందించకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు.  ఈ చట్టం విధివిధానాలు, అమలు నిబంధనలను కేంద్ర హౌంశాఖ సోమవారం సాయంత్రం నోటిఫై చేసింది.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందిస్తోంది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది.

➡️