అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాం : లోకేశ్‌

Mar 24,2024 11:56 #Nara Lokesh, #speech, #State

అమరావతి : తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీ అపార్టుమెంట్‌ వాసులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ …. సిఎం జగన్‌ నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని విమర్శించారు. ఆయన ఇంటి సమీపంలో తాగునీటి సమస్య ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా ఎపిని అభివఅద్ధి చేస్తామన్నారు. బోధనా పద్ధతుల్లో కేజీ నుంచి పీజీ వరకు సమూల మార్పులు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే శాంతి భద్రతలు అదుపులో లేవుని ఆరోపించారు. గంజాయి బ్యాచ్‌ ఆగడాలకు హద్దు లేకుండాపోతోందన్నారు. రాష్ట్రంలోని యువతకు మంచి ఉద్యోగాలు రావాలంటే విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలన్నారు. ఐరోపా దేశాల్లో ఉచితంగా చదువు, వైద్యం అందిస్తున్నారని, అదే పద్ధతిని మన రాష్ట్రంలోనూ ప్రవేశపెడతామని అన్నారు. ప్రజలు కట్టిన పన్నులకు వారు పొందుతున్న వసతులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోందని…. దీన్ని తగ్గించాల్సిన అవసరముంది అని లోకేశ్‌ అన్నారు.

➡️