పర్యావరణ అధ్యయనానికి ముందే’జల విద్యుత్‌’ అనుమతులు

  • రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం
  • వ్యతిరేకిస్తున్న పర్యావరణ నిపుణులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నదీ పరివాహక ప్రాంతం సామర్థ్యం, ప్రభావ అంచనాపై అధ్యయనం జరగక ముందే ప్రతిపాదిత జలవిద్యుత్‌ (హైడ్రో) ప్రాజెక్టులకు సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వొచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిని పర్యావరణ నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. పర్యావరణ ప్రభావం గురించి అధ్యయనం జరిపిన తరువాతే జల విద్యుత్‌ ప్రాజెక్టు గురించి ఆలోచించాలని 2013 పర్యావరణ చట్టం(సవరణ) స్పష్టం చేస్తోంది. దీనికి విరుద్ధంగా ఈ ఆదేశాలున్నాయి. ‘వన్‌ (సంరక్షణ్‌ ఏవం సంవర్ధన్‌) అధినియం-1980 కింద అనుమతి మంజూరుకు సమయం తీసుకుంటుంది. కనుక కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు (ఎంఇఎఫ్సిసి) శాఖ అటవీ సంరక్షణ విభాగం అధినియం కింద ‘సూత్రప్రాయంగా’ ఆమోదం మంజూరు చేయొచ్చని తెలిపింది.నదీ పరివాహక ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ జలవిద్యుత్‌ ప్రాజెక్టులను మంజూరు చేయా లంటే దాని సామర్థ్యం, పర్యావరణ ప్రభావ అధ్యయ నాలు తప్పనిసరి అని మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్త ప్రాజెక్టుల మంజూరుకు ఈ నిబంధనలు వర్తిస్తాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ‘చట్ట ప్రకారం నదీ పరివాహక ప్రాంతాల ప్రభావ అంచనా లేకుండా అటువంటి ఏదైనా ప్రాజెక్ట్‌ కోసం సూత్రప్రాయంగా ఆమోదం తెలపడమంటే పర్యావరణ భద్రతలను బలహీనపరచడమేనని అన్నారు.

➡️