సీఎం పర్యటన… సీపీఎం, వివిధ సంఘాల నేతలు అరెస్టు

house arrest in bhimavaram cm visit

ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గురువారం రాత్రి నుంచే సీపీఎం, వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్ళారు. మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. జిల్లా కార్యదర్శి బి.బలరాంని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. భీమవరం మెంటేవారితోట సిపియం జిల్లా కార్యాలయంను పోలీసులు ముట్టడి చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జె.ఎన్.వి గోపాలన్, యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తిలను పోలీసులు అరెస్ట్ చేసి భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషనకు తరలించారు. సిపియం జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు బి.వాసుదేవరావు ఉండిలో గృహ నిర్భందం విధించారు. సిఐటీయూ నాయకులకు నోటిసులు అందజేశారు.

 

house arrest in bhimavaram cm visit balaram

అరెస్టులు కాదు…  సమస్యలు పరిష్కరించాలి…
జిల్లాలో కాలుష్యం, రైతులు, కౌలురైతులకు నష్టపరిహారం, రోడ్లు`కంపోస్టు యార్డులు, దళితుల స్మశాన, అంగన్‌వాడి, ఆశ,  విఆర్.ఎ, ఎస్ఎస్ఎ, మున్సిపల్‌ కార్మికులు, ఉపాధ్యాయులు తదితరుల  సమస్యలు పరిష్కరించాలని సిపిఎం కార్యాలయంలో ప్లకార్డుతో నిరసన తెలుపుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం

house arrest in bhimavaram cm visit

పాలకొల్లులో యుటిఎఫ్ నేత రామభద్రం ముందస్తు అరెస్ట్

పాలకొల్లు : భీమవరంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో భీమవరం వెళ్ళకుండా యుటిఎఫ్ జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు ఎకెవి రామభద్రం ను పాలకొల్లు పోలీసులు గత రాత్రి నోటీసులు ఇచ్చి తరువాత పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్ కు కూడా భీమవరం వెళ్ళకుండా నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా అంగన్వాడీ నేతలు కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. వారు భీమవరం వెళ్ళకుండా ఆంక్షలు విధించారు.

 

 

 

 

 

 

 

 

 

 

ఉండి : సీఎం భీమవరం పర్యటన నేపథ్యంలో భీమవరం వెళ్ళనీయకుండా సిపిఐ నాయకులు కలిశెట్టి వెంకట్రావు, సనపల శ్రీనివాసరావులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన ఉండి పోలీసులు.

house arrest in bhimavaram cm visit

 

➡️