ఆసుపత్రిలో చేరిన నటి హేమా చౌదరి-ఆరోగ్యం విషమం

బెంగళూరు : సౌత్‌ ఇండియా ప్రముఖ నటి హేమా చౌదరి బ్రెయిన్‌ హెమరేజ్‌ కారణంగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్సకు స్పందించడం లేదు. ఆమె కుమారుడు నేడు విదేశాల నుంచి వస్తున్నారు. నటి హేమా చౌదరి ఎక్కువగా కన్నడ చిత్రాల్లోనే నటించారు. ఆపై తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.

కన్నడలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌, అంబరీష్‌, శంకర్‌నాగ్‌, అనంతనాగ్‌, రవిచంద్రన్‌ వంటి ప్రముఖ నటులతో హేమా చౌదరి నటించారు. కమల్‌ హాసన్‌, చిరంజీవి, మోహన్‌ బాబు, ప్రేమ్‌ నజీర్‌ తదితరులతో కూడా నటించారు. కె.బాలచందర్‌, డి.యోగానంద్‌, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కె.శంకర్‌ లాంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో కూడా హేమా చౌదరి నటించారు. పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ, మేస్త్రీ, ప్రేమాలయం వంటి చిత్రాల్లో ఆమె నటించించారు. ఆపై కర్నాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్‌ పాపులర్‌ స్టార్‌ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

➡️