ఆనందోత్సాహల మధ్య హోలీ

Mar 25,2024 13:08 #Chittoor District

ప్రజాశక్తి – సోమల : హోలీ పండుగ పర్వదినాన్ని మండలంలోని పలుచోట్ల పిల్లలు, మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. చిన్నారులు రంగులను చేత బూని ఒకరికొకరు రంగులను పూసుకుంటూ రంగేళి హోలీ అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఆనంద ఉత్సాహాలతో పండుగ వాతావరణం లో హోలీ పండుగను జరుపుకున్నారు. ఇదే క్రమంలో మహిళలు కూడా రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు. హోలిక అనే రాక్షసి అగ్ని కీలల్లో దహనమైన సందర్భంగా హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీకృష్ణుడు తన బృందావనంలో తోటి స్నేహితులతో హోలీ పండుగ ఆడుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇలా పురాణ ఇతిహాసాలకు దగ్గరగా హోలీ పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉండడంతో నేటికీ హోలీ పండుగను చిన్నారులు పెద్దలు మహిళలు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను నిర్వహించుకుంటూ వస్తున్నారు.

➡️