ఉత్కంఠపోరులో హాకీ అమ్మాయిలు ఓటమి

Dec 1,2023 22:05 #Sports

 

-మహిళల హాకీ జూనియర్‌ ప్రపంచకప్‌

మహిళల హాకీ జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత జట్టు పరాజయాన్ని చవిచూసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 3-4గోల్స్‌ తేడాతో జర్మనీ చేతిలో ఓడింది. భారత్‌ తరఫున అన్ను(11వ ని.), రూప్‌ని కుమారి(14వ ని.), ముంతాజ్‌ ఖాన్‌(24వ ని.) ఒక్కో గోల్‌ కొట్టారు. ఇక జర్మనీ తరఫున సోఫియా(17వ ని.), ప్లుట్‌(21, 36వ ని.), కరోలిన్‌(38వ ని.) ఒక్కో గోల్‌ కొట్టారు. తొలి క్వార్టర్‌ ముగిసేసరికి భారత్‌ 2-0గోల్స్‌ ఆధిక్యతలో నిలువగా.. రెండో క్వార్టర్‌లో జర్మనీ రెండు, భారత్‌ ఒక గోల్‌ కొట్టాయి. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్‌ 3-2గోల్స్‌తో ఆధిక్యతలో నిలిచింది. మూడో క్వార్టర్‌లో జర్మనీ రెండు గోల్స్‌ చేయడంలో 3-4తో భారత్‌ వెనుకబడింది. నిర్ణయాత్మక మూడో, చివరి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో జర్మనీ జట్టు 4-3గోల్స్‌తో భారత్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ జట్టు కెనడాను చిత్తుచేయగా.. డిసెంబర్‌ 2న జరిగే మూడో మ్యాచ్‌లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.

➡️