చారిత్రాత్మక జ్ఞాపకాలను కాపాడుకోవాలి : టీటీడీ చైర్మెన్‌ భూమన

 ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో ఆధునికరించిన కష్ణమనాయుడి కుంటను టీటీడి చైర్మెన్‌, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14వ శతాబ్దంలో తిరుమలకు వెల్లె శ్రీవారి భక్తులకు ఈ నీటి కుంట ఉపయోగంలో వుండేదని, భక్తులు ఇక్కడ సేద తీరే వారని, అటు తరువాత గాలి గోపురం వద్ద, కాలిబాటలోని లక్ష్మీనరసింహ ఆలయం వద్ద మరో కుంట వుండేదని, అటువంటి చారిత్రాత్మక కుంట జ్ఞాపకాలను పరిరక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో చెన్నారెడ్డి కాలనీలోని పాడు పడిపోయి, శిధిలావస్థకు చేరుకున్న కృష్ణమనాయుడి కుంటను తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ నిధులతో ఆధునికరించి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కోనేరును ఆధ్యాత్మికంగా నిర్వహించేందుకు ఇస్కాన్‌ టెంపుల్‌ ముందుకు రావడం అభినందనీయమన్నారు. అదేవిధంగా టీటీడీ నిధులతో గాలిగోపురం, లక్ష్మీనరసింహ ఆలయాల వద్దనున్న పురాతన బావులను ఆధునికరించి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టర్‌ శిరీష, తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, డిప్యూటీ మేయర్‌ భూమన అభినరు రెడ్డి, డిప్యూటీ మేయర్‌ ముద్రనారాయణ, కార్పొరేటర్‌ పుణిత, ఇతర కార్పొరేటర్లు తిరుపతి మునిరామిరెడ్డి, వరికుంట్ల నారాయణ, మునిసిపల్‌ ఇంజనీర్‌ వెంకట్రామిరెడ్డి, డిఈ విజయకుమార్‌ రెడ్డి, నాయకులు బొగ్గుల వెంకటేష్‌, పెరుగు బాబు యాదవ్‌, శ్యామల, అరుణ్‌ కుమార్‌, వెంకటేష్‌ రాయల్‌, కంకణాల రమేష్‌, తలారి రాజేంద్ర, తాళ్ళూరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️