హిమాలయాల విపత్తుపై కాప్-28 చర్చించాలి : యుఎన్ చీఫ్

himalayas-need-help-cop28-talks-must-respond-says-un-chief-antonio

దుబాయ్ : హిమాలయ పర్వతాలు ప్రమాదకర స్థాయిలో కరిగిపోతున్న నేపథ్యంలో కాప్-28 సమ్మిట్ లో ఈ విపత్తుపై చర్చించాలని యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. “పర్వతాలు సహాయం కోసం కేకలు వేస్తున్నాయి, కాప్-28 ప్రతిస్పందించాలి.” అని ఆయన పేర్కొన్నారు. నేపాల్ ప్రధాన మంత్రి ప్రచండ మరియు ఇతర దేశాధినేతలు మరియు ప్రతినిధులతో శనివారం ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న గుటెర్రెస్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిమాలయాలలో ఉద్భవించే సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర వంటి 10 ప్రధాన నదులపై దాదాపు 240 మిలియన్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఈ నదుల దిగువన నివసిస్తున్న ఎనిమిది దేశాలకు చెందిన మరో బిలియన్ ప్రజలు కూడా ఆధారపడి ఉన్నారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్-28)సమ్మిట్ లోని పర్వత దేశాలతో జరిగిన సమావేశంలో ప్రసంగించిన ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ… కేవలం 30 సంవత్సరాలలో నేపాల్ మంచులో దాదాపు మూడింట ఒక వంతు కనుమరుగైందని అన్నారు. ఇది గ్రీన్‌హౌస్ వాయువు కాలుష్యంతో ముడిపడి ఉందని, దీంతో భూమి యొక్క వేడి పెరుగుతుందని తెలిపారు. పంథాలో మార్పు రాకపోతే విపత్తు తప్పదని ఆయన అన్నారు. హిమాలయాలు పూర్తిగా అదృశ్యం కావచ్చని ఆయన హెచ్చరించారు.

➡️