రాజీనామా వార్తలను కొట్టిపారేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి

సిమ్లా :      హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు రాజీనామా చేశారన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. తాను రాజీనామా చేయడం లేదని అన్నారు. పార్టీలో తిరుగుబాటు లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని అన్నారు. సిఎంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టేందుకు బిజెపి యత్నిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్‌ బుధవారం ఉదయం గవర్నర్‌తో సమావేశమయ్యారు. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటంతో పాటు రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌ రాజీనామా చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి క్లిష్టంగా మారింది. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బిజెపి కిడ్నాప్ చేసిందని సుఖ్వీందర్ సింగ్ మండిపడ్డారు.  తమ ఎమ్మెల్యేలను బిజెపి  కిడ్నాప్‌ చేసిందని, సీఆర్‌పీఎఫ్‌ సాయంతో వారిని హర్యానాకు తీసుకెళ్లారని అన్నారు.

➡️