హీరో వెంకటేశ్‌ ఇంట పెళ్లి సందడి

Mar 15,2024 12:57 #Celebrations, #Hero Venkatesh, #wedding

తెలంగాణ : టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన రెండో కుమార్తె హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడితో నేడు వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న (మార్చి 14) మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రతా శిరోద్కర్‌ షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులంతా వెంకటేశ్‌ కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. గతేడాది అక్టోబర్‌లో హయ వాహిని నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు పెళ్లికి కూడా టాలీవుడ్‌ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రామానాయుడు స్టూడియో ఈ వివాహానికి వేదిక కానున్నట్లు సమాచారం. వెంకటేశ్‌, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయ వాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్‌ ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి 2019లో జరిగింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటున్నారు.

 

➡️